హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 17న గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాల ( AIIMS) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఎయిమ్స్‌లో సంబంధిత వైద్యాధికారులతో పాటు నగరపాలక, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
రాష్ట్రపతి ఎయిమ్స్ కు చేరుకునే మార్గంలో పటిష్టభద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి పాల్గొనే సదస్సు ప్రధాన ఆడిటోరియాన్ని పరిశీలించారు. అతిథుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీఐపీలు, అధికారులు, ప్రముఖుల వాహన పార్కింగ్ ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు.