తన కుటుంబంలో గొడవలు జరిగాయని, తనయుడు మంచు మనోజ్ తనపై కేసు పెట్టాడంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. మంచు మనోజ్ గాయాలతో హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు చేశాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అలాంటి వార్తల ప్రసారం ఆపాలని కోరారు.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో ఆస్తుల పంపకాలపై వివాదాలు ఉన్నాయని ప్రచారం సాగుతోన్న వేళ, కేసు వ్యవహారం వైరల్ అయింది. సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాలోనూ వార్తలు వచ్చాయి. నటుడు మోహన్ బాబు, తనయుడు మనోజ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని, ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ కేసు వెనక్కు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటూ మీడియాలో కథనాలు ప్రారంభించారు. దీనిపై మోహన్ బాబు స్పందించాల్సి ఉంది.