INDW VS AUSW: మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండింటిలో భారత్ ఓడింది. దీంతో సిరీస్ ను ఆసీస్ మహిళల జట్టు కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 371 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 249 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో ఆసీస్ మహిళల జట్టు 122 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆసీస్ ఇన్నింగ్స్ లో జార్జియా వోల్స్ (101), ఎలీసా పెర్రీ (105) శతకాలతో రాణించగా ఫోబే లిచ్‌ఫీల్డ్ (60), బెత్ మూనీ (56) అర్ధ శతకాలు చేశారు. ఆష్లే గార్డెనర్, సోఫీ డకౌట్ అయ్యారు. అన్నాబెల్ సదర్లాండ్( 6), అలానా కింగ్( 8), తహ్లియా మెక్‌గ్రాత్ (20*) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో సైమా ఠాకూర్ మూడు వికెట్లు తీయగా మిన్ను మణి రెండు, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ, రేణుకా ఠాకూర్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.
ఆసీస్ విధించిన 372 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 249 పరుగులు మాత్రమే చేయగల్గింది. రిచా ఘోష్( 54), మిన్ను మణి( 46), జెమీమా రోడ్రిగ్జ్( 43), హర్మన్‌ప్రీత్ కౌర్ (38) పోరాటపటిమ చూపారు.
ఆసీస్ బౌలర్లలో ఆనా బెల్ నాలుగు వికెట్లు తీయగా మెగాన్, కిమ్ గార్త్, గార్డ్నర్, సోఫీ, అలానా కింగ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.