మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ గా బీజేపీ నేత ఎన్నికకానున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఇప్పటికే అసెంబ్లీ అధికారులను కలసి నామినేషన్ పత్రాలు అందజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, చంద్రకాంత్ పాటిల్ సమక్షంలో నర్వేకర్ రిటర్నింగ్ అధికారికి పత్రాలను సమర్పించారు.
షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు ఎన్నిక జరగనుంది. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి 21 వరకు నాగ్‌పూర్‌లో జరగనున్నాయి.
మహారాష్ట్రలో నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ-శివసేన-ఎన్సీపీ మహాయుతి కూటమి 230 స్థానాల్లో గెలిచింది. దీంతో బీజేపీ నుంచి ఫడ్నవీస్ సీఎంగా శివసేన నుంచి ఏక్ నాథ్ శిందే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ లు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు.