నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో ఆస్తుల పంపకం గొడవలు రచ్చకెక్కాయి. తనపై మోహన్‌బాబు దాడి చేశాడంటూ తనయుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ తనపై దాడికి దిగాడంటూ మోహన్‌బాబు చెబుతున్నారు. గాయాలతో నేరుగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తనపై, తన భార్యపై మోహన్‌బాబు దాడికి దిగాడని, మనుషులతో కొట్టించాడంటూ మనోజ్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు ఉన్న విషయం తెలిసిన విషయమే అయినా, ఇలా రోడ్డునపడిన ఘటనలు లేవు. గతంలో మనోజ్, విష్ణు మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
మోహన్‌బాబు స్కూల్ ఆస్తుల విషయంలో కుటుంబంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ గత కొంత కాలంగా మోహన్‌బాబు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. తనయుడు విష్ణుతో కూడా గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వీరి కుటుంబంలో గొడవలు రోడ్డునపడ్డాయి.