ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా భారత్ – ఆసీస్
బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో భారత్ పరాజయం చెందింది. ఆసీస్, భారత్ పై పదివికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో ఆసీస్, భారత్ చెరొకటి గెలిచాయి.
అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లోనూ భారత్ స్వల్ప స్కోరు మాత్రమే చేయగల్గింది.ఆసీస్ బౌలర్ కమిన్స్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. రెండో రోజు ఆటలో 5 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసిన భారత్, మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే పంత్ వికెట్ కోల్పోయింది. అనంతరం భారత ఆటగాళ్ళు పెవిలియన్ కు క్యూకట్టారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ 175 పరుగులకు ముగిసింది. రెండు ఇన్నింగ్సుల్లోనూ తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. నితీశ్ ఆ మాత్రం స్కోర్ చేయకపోతే భారత్ ఇన్నింగ్స్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 3.2 ఓవర్లలో సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులకే పెవిలియన్ చేరింది. 19 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకోగా మూడో స్థానానికి భారత్ పడిపోయింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది.