సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా సాగుతోన్న పోరాటంలో రెబల్స్ పైచేయి సాధించారు. డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా రెబల్స్ చుట్టుముట్టడంతో అక్కడి భద్రతా దళాలు, సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ దేశం వదలి పారిపోయారు.
ప్రజలు ఏది కోరుకుంటారో, అలాంటి ప్రభుత్వం వస్తుందని ప్రధాని మహమ్మద్ అల్ జలాలీ వ్యాఖ్యానించారు. తిరుగుబాటుదారులు దేశంలోని 90 శాతం ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు.
సిరియాలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం వస్తుందని, ప్రపంచ దేశాలతో సిరియాకు మంచి సంబంధాలున్నాయని ప్రధాని మహమ్మద్ అల్ జలాలీ అభిప్రాయపడ్డారు. సిరియా ఓ సాధారణ దేశమని త్వరలో ఇక్కడ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
పదేళ్లుగా తిరుగుబాటుదారులు సిరియాలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. కొద్ది రోజులుగా ప్రభుత్వ దళాలకు, రెబల్స్‌కు పోరు సాగుతోంది. ఈ యుద్ధంలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు.