దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు ముఖ్యమంత్రిని కోరారు. చంద్రబాబునాయుడు నివాసంలో ఆయనతో సమావేశమైన నేతలు దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ వినతి పత్రం సమర్పిరంచారు.వీహెచ్‌పి రూపొందించిన ముసాయిదాను సైతం సీఎంకు అందించారు.
విజయవాడలో జనవరి 5న జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియజేశారు.సీఎంను కలిసిన వారిలో క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కోశాధ్యక్షులు దుర్గ ప్రసాదరాజు ఉన్నారు.