కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో దారుణం జరిగింది.భారత్‌కు చెందిన విద్యార్దిని కెనడాకు చెందిన మరో విద్యార్ధి పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఒంటారియా ప్రావిన్స్ సర్నియాలోని లాంగ్‌టన్ కాలేజీలో మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తోన్న ఇద్దరు విద్యార్థులు గురాసిస్ సింగ్, క్రాస్‌లీ హంటర్ గొడవ పడ్డారు.ఇద్దరూ వంటగదిలోకి గొడవపడి కొట్టుకున్నారు. ఆ సమయంలో హంటర్ కత్తితో గురాసిన్ సింగ్‌పై దాడికి దిగాడు. పలుమార్లు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో గురాసిన్ సింగ్ తీవ్ర గాయాలై పడిపోయాడు. ఇది గమనించి విద్యార్ధులు పోలీసులకు సమాచారం అందించారు.
గురాసిన్ సింగ్‌ను సమీపంలోకి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తరవాత కొద్ది సేపటికే గురాసిన్ సింగ్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వారి గొడవకు కారణాలు తెలియాల్సి ఉంది.