కడప మున్సిపల్ స్కూల్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 45094 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ళలో ఈ సమావేశం జరిగింది. బాపట్ల మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు పలు సూచనలు చేసిన సీఎం చంద్రబాబు, అధికారులకు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతీ విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను యూనివర్శిటీ స్థాయి వరకు ట్రాకింగ్ చేయాలని ఆదేశించారు.
9వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను బోధిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
కడప మున్సిసల్ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పవన్ కళ్యాణ్ సమస్యలపై ఆరా తీశారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.