బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. భారత్ విధించిన లక్ష్యాన్ని టీ బ్రేక్ సమయానికే ఛేదించిన ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. టీ విరామసమయానికి క్రీజులో హెడ్(53)తోపాటు మిచెల్ మార్ష్ (2*) ఉన్నారు. ఆసీస్ 11 పరుగుల ఆధిక్యం లో ఉంది.
రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఆసీస్ రెండో వికెట్ నష్టపోయింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(39) బుమ్రా , వెనక్కి పంపాడు. బుమ్రా బౌలింగ్ లో మెక్ స్వినీ, వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ గా దొరికిపోయాడు. దీంతో స్కోర్ బోర్డు 91 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(2) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ నష్టపోయింది. బుమ్రా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. లబుషేన్ (64 ) నితీశ్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైశ్వాల్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ఈ ఔట్ సాధ్యమైంది. 56 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 4 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.
బుమ్రా ఘనత.. ఏడాదిలో 50 వికెట్లు
ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా ఘనత సాధించాడు. అడిలైడ్ లో రెండోరోజు ఆటలో భాగంగా ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా ఓసెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడంతో ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 11 టెస్టులు ఆడిన బుమ్రా 50 వికెట్లు తీశాడు . బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు.