ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వ బాధ్యతలు చేపట్టారు. జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇప్పటికే వరకు ఆయన నిర్వర్తించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడుగా శ్రీలంక క్రికెటర్ షమ్మీ సిల్వా బాధ్యతలు తీసుకున్నారు.
సిల్వాకు ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్న సిల్వా ప్రతిభకు అవకాశాలు అందించేందుకు , అందరినీ ఐక్యంగా ఉంచడానికి సభ్య దేశాలతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు.
షమ్మీ సిల్వా శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా మూడుసార్లు ఎన్నికయ్యారు. షమ్మీ సిల్వాకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.