మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప ఆయుధం ధ్యానం. శతాబ్దాలుగా ధాన్యం ప్రాధాన్యతను భారత్ ప్రపంచానికి చాటిచెబుతూనే ఉంది. ఇందులో భాగంగా అనేక దేశాల్లో ధాన్య కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ధాన్యానికి మరింత ప్రాధాన్యత కల్పించేలా భారత్ చేసిన ప్రయత్నం ఫలించింది. డిసెంబరు 21వ తేదీని ఏటా ధాన్య దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇప్పటికే జూన్ 21న ఏటా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తాజాగా ధాన్యం కూడా ఆ జాబితాలో చేరింది. మన సాంప్రదాయం ప్రకారం శీతాకాల అయనాంతం ఉత్తరాయనంలో అడుగుపెట్టే రోజు, అంటే డిసెంబరు 21వ తేదీని ధ్యాన దినోత్సవంగా ప్రకటించాలని భారత్ చేసిన సూచనలను ఐరాస పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
పదేళ్ల కిందట భారత్ ఐరాసలో యోగాపై కొన్ని ప్రతిపాదనలు చేసింది. జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా ప్రకటించాలని కోరింది. వేసవి అయనాంతం దక్షిణాయనంలోకి ప్రవేశించే రోజు జూన్ 21వ తేదీని ఐరాస యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీంతో యోగాకు మరింత ప్రాధాన్యత లభించింది. తాజాగా ధాన్య విద్యను కూడా ప్రపంచ దేశాల్లో మరింత క్రియాశీలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐరాస ప్రయత్నాలు చేయనుంది.
ఏటా డిసెంబరు 21వ తేదీని ధాన్య దినోవత్సంగా తీసుకురావాలంటూ లిచిటన్‌స్టన్ చేసిన ప్రతిపాదనలను 193 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ తీర్మానానికి నేపాల్, మెక్సికో, బంగ్లాదేశ్, లబ్జెంబర్గ్, బల్గేరియా, పోర్చుగల్, అండేరా కో స్మాన్సరర్స్‌గా ఉన్నాయి.