మరోసారి సత్తా చాటిన నితీశ్ రెడ్డి
అడిలైడ్ వేదికగా జరుగుతున్న టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో44.1 ఓవర్లు ఆడి 180 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42)మరోసారి సత్తా చాటాడు. 54 బంతులు ఆడి 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. పెర్త్ టెస్ట్ లోనూ నితీశ్ ఆకట్టుకున్నాడు.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్( 37), శుభ్‌మన్ గిల్( 31), అశ్విన్ (22), రిషభ్ పంత్ (21) కారణంగా స్కోర్ బోర్డు 180కి చేరింది. విరాట్ కోహ్లీ( 7), రోహిత్( 3) విఫలమయ్యారు యశస్వి జైస్వాల్, హర్షిత్, బుమ్రా డకౌట్ అయ్యారు. సిరాజ్( 4) నాటౌట్‌గా నిలిచాడు.
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీయగా, కమిన్స్ , స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు.
తొలి సెషన్ లో ఆసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఉస్మాన్ ఖవాజా (13) బుమ్రా వేసిన 10.6 బంతికి రోహిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్కోర్ బోర్డు 24 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయిన ఆసీస్ ఆ తర్వాత మరింత జాగ్రత్తపడింది.
నాథన్ మెక్ స్వనీ, మార్నుస్ లబుషేన్ క్రీజులో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మెక్ స్వనీ(38), లబుషేన్ (20) పరుగులుచేశారు.