భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో టాస్ నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 82 పరుగులు చేసింది. బ్రేక్ సమయానికి క్రీజులో రిషభ్ పంత్ , రోహిత్ శర్మ ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా బోలాండ్కు ఒక వికెట్ దక్కింది.
బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ యశస్వి జైస్వాలన్ ను తొలి బంతికే మిచెల్ స్టార్క్ డకౌట్ చేశారు. ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి శుభమన్ వచ్చాడు. కేఎల్ రాహుల్, శుభమన్ కలిసి 15 ఓవర్లకు 53 పరుగులు చేశారు. కానీ ఈ జోడీని స్టార్క్ విడగొట్టాడు. కేఎల్ రాహుల్ (37)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో 69 పరుగులకు భారత్ రెండు వికెట్ల నష్టపోయింది. దీంతో క్రీజులోకి విరాట్ కోహ్లీని వచ్చినప్పటికీ స్వల్పస్కోరుకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు.
మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 77 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ నష్టపోయింది. అనంతరం క్రీజులోకి రిషభ్ పంత్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ కూడా ఔట్ అయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (31) ఎల్బీగా వెనుదిరిగడంతో క్రీజులోకి రోహిత్ శర్మ వచ్చాడు. తొలి సెషన్ విరామ సమయానికి క్రీజులో రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఉన్నారు.