భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల జరుగుతోంది. నేడు బ్రిస్బేన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఓడింది. ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 100 పరుగులు మాత్రమే చేయగల్గింది. 34.2 ఓవర్లు ఆడి అన్ని వికెట్లు నష్టపోయి పెవిలియన్ చేరింది.
బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ (23) మాత్రమే ఫరవాలేదు అనిపించగా
హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) నిరాశపరిచారు.ఓపెనర్లు ప్రియా పునియా( 3), స్మృతీ మంధాన (8), దీప్తి శర్మ( 1), సైమా ఠాకూర్( 4), టిటాస్ సధు( 2) విఫలమయ్యారు.
కెరీర్‌లో తొలి వన్డే ఆడిన ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్ ఐదు వికెట్లు తీయగా కిమ్ గార్త్, గార్డెనర్, సదర్లాండ్, అలానా కింగ్ తలో ఒక వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య ఛేదనలో తడబడిన ఆసీస్, 101 పరుగులు చేసి విజయం సాధించింది.16.2 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు జార్జియా వోల్ (46), ఫోబ్ లిట్చ్‌ఫీల్డ్ (35) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు.