అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఓ యువతి అరాచకానికి తెరలేపింది. పుష్ఫ 2 సినిమాలోని ఐటమ్ సాంగ్‌కు డాన్సులు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వీడియో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం అలిపిరి శ్రీవారి పాదాలను కూడా వదలడం లేదని టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
యువతి రీల్స్‌పై టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. యువతిపై కేసు నమోదుకు ఆదేశించారు. ఈ లోగా తప్పైపోయింది క్షమించాలంటూ, ఆ యువతి మరో వీడియో విడుదల చేసింది.
పోలీసులు కేసు నమోదు చేస్తారా? కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఇటీవల తిరుమలలో అన్యమత ప్రచారం కూడా పెరిగిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై టీటీడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అలిపిరి నుంచి తిరుమలలో ఎక్కడైనా అన్యమత ప్రచారం చేస్తూ వీడియోలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు.