మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో మరో రెండు చీతాలు ఇక నుంచి సంచరించనున్నాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను బుధవారం నేషనల్ పార్కులోకి అటవీ అధికారులు వదిలారు. ఇప్పటివరకు ఎన్క్లోజర్లో వాటిని సంరక్షించిన అధికారులు, భద్రతకు సంబంధించిన అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. అడవిలో స్వేచ్ఛగా విహరించేందుకు విడిచిపెట్టామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్ శర్మ పేర్కొన్నారు.
సఫారీ యాత్రకు వెళ్ళే భక్తులు వీటిని కూడా ఇక నుంచి సందర్శించవచ్చు. పారాండ్ ప్రాంతం అహేరా టూరిజం జోన్లోకి వస్తుందని, సందర్శకులు తమ సఫారీ యాత్ర సందర్భంగా వాటిని చూడొచ్చని వివరించారు.
ప్రస్తుతం కునో నేషనల్ పార్క్లో 12 కూనలు సహా 24 చీతాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో తగిన ఆవాస ప్రాంతాలు లేకపోవడం, వేట తదితర కారణాలతో 70 ఏళ్ళ కిందటే చీతాలు అంతరించాయి. చివరి చీత 1947లో ఛత్తీగఢ్లో కనిపించింది. దేశంలో చీతాలు అంతరించాయని 1952లో ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చీతా ప్రాజెక్టును చేపట్టింది.2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తెప్పించిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్ ఎన్క్లోజర్లలోకి విడుదల చేశారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించారు. ప్రస్తుతం కునో పార్క్లో 24 చీతాలు ఉండగా వాటిలో 12 పెద్దవి.