యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. నేటి ఉదయం 8.5 గంటల కౌంట్‌డౌన్ ను ప్రారంభించింది. బుధవారం సాయంత్రం 4.08 నిమిషాలకు ప్రోబా-3 నింగికి ఎగరాల్సి ఉన్నప్పటికీ మిషన్‌ను నేటికి వాయిదా వేశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభ్యర్థన మేరకు ప్రయోగం నేటికి వాయిదా పడినట్లు ఇస్రో వివరించింది. నేటి సాయంత్రం 4.04 నిమిషాలకు పీఎస్ఎల్వీసీ59 నింగికి ఎగురనుంది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. సూర్యుడిపై కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం, కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 లక్ష్యమని ఇస్రో నిపుణులు వెల్లడించారు.