ఆంధ్రప్రదేశ్ లో మరో 53 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతించింది. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కాలేజీలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యాయి.