పీఎస్‌ఎల్‌వీ సీ 59 ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ 59 రాకెట్ ప్రయోగానికి 25 గంటల కౌంట్ డౌన్ కొనసాగింది. చివరి క్షణంలో ప్రయోగం వాయిదా వేశారు. యూరోపియన్ స్పేస్ ఏజన్సీ రాకెట్లో లోపాలను గుర్తించి హెచ్చరికలు జారీ చేయడంతో ప్రయోగం వాయిదా వేశారు.
యూరోపియన్ ఏజన్సీ యూనియన్‌కు చెందిన 550 కేజీల ఇన్ ఆర్బిట్ డిమానిస్ట్రేషన్ లక్ష్యంగా ఈ ఉపగ్రహం ప్రయోగించాలని భావించారు. దీని ద్వారా కృత్రిమ సూర్య గ్రహణ పరిస్థితులను సృష్టించి ప్రయోగాలు నిర్వహించాలని భావించారు. చివరి క్షణంలో సాంకేతిక లోపాలు గుర్తించడంతో ప్రయోగం వాయిదా పడింది. మరలా ఈ ప్రయోగం ఎప్పుడు చేపట్టే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.