మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని విధాన భవన్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఫడణీస్‌ను శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఫడణవీస్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మిత్రపక్షాల నుంచి లోక్‌నాథ్ శిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
కేంద్రం నుంచి పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఎడతెగని చర్చలకు ఎట్టకేలకు తెరపడింది. ఫడణవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.