అకాలీదళ్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది.
పంజాబ్‌లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం ముందు సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ దుండగుడు జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే బాదల్ అనుచరులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
కాల్పులకు దిగిన వ్యక్తిని పోలీసులు నరైన్ సింగ్ చోరాగా గుర్తించారు. ఇతను
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు అనుమానిస్తున్నారు.
1984లో నరైన్ సింగ్ పాకిస్థాన్ పారిపోయాడని అక్కడ ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందినట్లు పోలీసులు తెలిపారు. భారత్ తిరిగి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధాల చట్టం కింద నరైన్ సింగ్ జైలు శిక్ష కూడా అనుభవించాడు.
2007 నుంచి పదేళ్లపాటు అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడిగా సుఖ్ బీర్ సింగ్ బాదల్ మతపరమైన అనేక తప్పిదాలకు పాల్పడినట్లు అకాల్ తఖ్త్ నిర్థారించింది. ఇందుకు స్వర్ణదేవాలయంలో భక్తుల భూట్లు, వంట పాత్రలు శుభ్రం చేయాలని శిక్షి విధించింది. శిక్ష అనుభవించేందుకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఇవాళ ఉదయాన్నే దేవాలయం వద్ద కూర్చున్నారు. వెంటనే నరైన్ సింగ్ చోరా అనే వృద్ధుడు కాల్పులకు దిగాడు. ఈ దాడిలో బాదల్ సురక్షితంగా తప్పించుకున్నారు.