అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ లాభాలను ఆర్జించాయి. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు రాణించాయి. సెన్సెక్స్ ప్రారంభం నుంచి లాభాల్లో దూసుకెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 597 పాయింట్ల లాభంతో, 80529 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 24457 రికార్డు స్థాయికి చేరింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో అదానీ ఇన్ఫ్రా, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి లాభాల్లో పరుగులు తీశాయి. ఏషియన్ పెయింట్స్, ఎయిర్టెల్, ఐటీసీ, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంకు నష్టాలను చవిచూశాయి.
రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84.69 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్యారెల్ క్రూడాయిల్ 72 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2667 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.