ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గిరిజనులకు ప్రత్యేకంగా ఓ పథకం తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. గడచిన నాలుగేళ్లలో మంజూరు చేసినా నిర్మించని ఇళ్లను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మ్యారిటైమ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుర్వేద, హోమియో ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులకు ఆమోదం తెలిపారు.
ఐటీ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్స్ 4.0కు క్యాబినెట్ ఆమోదించింది. పర్యాటక పాలసీని ఆమోదించారు. పులివెందుల, ఉద్దానం తాగునీటి పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో జలజీవన్ పథకం నత్తనడక నడవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తైన సందర్భంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గడచిన ఆరు మాసాల్లో ఎవరెవరు ఏం చేశారో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మద్యం, బియ్యం మాఫియాలను అరికట్టామని సీఎం చెప్పారు.
డిసెంబరు 15న పొట్టిశ్రీరాములు ఆత్పారణ దినాన్ని సంస్మరణ దినంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. జలజీవన్ పథకాన్ని వేగవంతం చేయాలని ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.