అయోధ్య రామ మందిరం సముదాయంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సూర్య, గణేష్, శివ, దుర్గ, అన్నపూర్ణ, హనుమాన్ మందిరాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాల పురోగతిపై తాజా పరిస్థితిని తెలుపుతూ ఆలయ ట్రస్టీ ఫొటోలు విడుదల చేసింది.
రామాలయ నిర్మాణాన్ని 2025 జూన్‌కు పూర్తి చేయాలనుకున్నప్పటికీ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. దీంతో సెప్టెంబర్ 2025 నాటికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆలయ కమిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా వెల్లడిచారు. కూలీల కొరతతో పాటు బండల పని పూర్తి కాకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆలయ శిఖర నిర్మాణం కూడా ఆలస్యం అవుతోంది. సుమారు 200 మంది కూలీల కొరతతో పనులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది జనవరి 22న రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 11న ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. తిథి ప్రకారం ఈ వేడుక నిర్ణయించనున్నారు.