ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనాల సమయాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఆలయ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
శని, ఆది, సోమవారాలు, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున దేవస్థాన వైదిక కమిటీ సూచన మేరకు భక్తులందరికీ కేవలం స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రూ.500 రుసుంతో కల్పించబడుతున్న శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, రూ.5 వేల రుసుంతో నిర్వహిస్తున్న గర్భాలయ అభిషేకాలు, రూ.1500 రుసుంతో నిర్వహిస్తున్నసామూహికార్జిత అభిషేకాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆన్ లైన్ అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ మార్పును గమనించాలని ఈవో కోరారు.