జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో హర్వాన్‌లోని దచిగామ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సోమవారం సాయంత్రం నుంచి సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు కొనసాగుతుండగా భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఓ టెర్రరిస్టు చనిపోయాడు.
మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కి ఉండవచ్చు అని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.