రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఈ పర్యటనకు వస్తున్నారు. రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో తెలిపింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఏడాదికోసారి సమావేశంలో కావాలని భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఒప్పందం ఉందని తెలిపారు.
ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యటన తేదీ ఖరారు కానుందని తెలిపారు.రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్లో పర్యటనకు రానుండటం ఇదే మొదటిసారి. భారత గణతంత్ర వేడుకలకు పుతిన్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది.
ప్రధాని మోదీ ఈ ఏడాది జులైలో రష్యాలో పర్యటించి అక్కడ జరిగిన శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. తర్వాత బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు.
వచ్చే ఏడాది లో డోనాల్డ్ ట్రంప్ సైతం భారత్లో పర్యటించనున్నారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్ పర్యటనకు రానున్నారు.