దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల దురాక్రమణలపై చర్చ జరుగుతున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఏదైనా ఒక ప్రదేశంలో ముస్లిములు నమాజు చేస్తే, ఆ ప్రదేశం వక్ఫ్ ఆస్తి అయిపోతుందని ప్రకటించాడు.
‘‘మీను నమాజ్ చేస్తే, ఎవరో ఒకరు ఎక్కడైనా సరే నమాజు చేస్తే, దాన్ని వక్ఫ్ ఆస్తిగానే పరిగణిస్తాము’’ అని కళ్యాణ్ బెనర్జీ శనివారం నాడు ఒక బహిరంగ సభలో తన ప్రసంగం సందర్భంగా చెప్పాడు.
‘‘అలాంటి ప్రదేశంలో ఒక 20మంది, లేదా 15మంది, లేదా కనీసం ఐదుగురు (ముస్లిములు) క్రమం తప్పకుండా నమాజ్ చేస్తే, అది ఇంక వక్ఫ్ ఆస్తిగానే పరిగణించబడుతుంది’’ అని స్పష్టం చేసాడు.
కళ్యాణ్ బెనర్జీ, శ్రీరాంపూర్ లోక్‌సభా నియోజకవర్గం నుంచి టిఎంసి ఎంపీ. 2021లో సీతమ్మ గురించి, రామభక్తుల గురించి అవమానకరంగా మాట్లాడాడు.
‘‘రావణాసురుడు నన్ను ఎత్తుకుపోయినందుకు నేను కృతజ్ఞురాలిని. ఒకవేళ కాషాయ దళానికి చెందిన మీ అనుచరులు ఎవరైనా రామనామం జపిస్తూ నన్ను కిడ్నాప్ చేసి ఉంటే, నా పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బాధితుల్లాగ తయారయ్యేది’’ అని కళ్యాణ్ బెనర్జీ అప్పట్లో వ్యాఖ్యానించాడు.