రాయలసీమ ప్రాంతంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని మాజీమంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామనడం సరికాదని అన్నారు.
హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు సరికాదని అభిప్రాయపడ్డారు. కర్నూలులో బెంచ్ ను ఏర్పాటు చేయడం రాయలసీమకు అన్యాయం చేయడమే అన్నారు.
కడప కేంద్రంగా పనిచేసే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారన్న శైలజానాథ్, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.