ఆసియా కప్ అండర్ 19 ట్రోఫీ -2024లో భాగంగా నేడు భారత జట్టు, జపాన్ తో తలపడుతోంది. షార్జావేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన జపాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన ఆయూష్ మాత్రే ,వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఇద్దరూ కలిసి 42 పరుగులు సాధించారు. ఆరో ఓవర్ ముగిసే సరికి స్కోర్ బోర్డు 54 పరుగులకు చేరింది. ఆ తర్వాత చార్లస్ హింజ్ వేసిన 7.2 బంతికి సూర్యవంశీ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 65 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. దీంతో క్రీజులోకి ఆంద్రదే సిద్ధార్థ్ వచ్చాడు. 8 ఓవర్లకు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 66 పరుగులు చేసింది.
పది ఓవర్లకు భారత స్కోర్ బోర్డ్ 75కు చేరింది. తర్వాతి 10.1 బంతిని ఆడిన ఆయూష్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 27 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 81 పరుగుల వద్ద ఆయూష్ మాత్రే(54) ఔట్ అయ్యాడు. ఆరవ్ తివారీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.
లీగ్ దశలో తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడిన భారత్, 43 పరుగుల తేడాతో ఓడింది.