ఉద్యోగులు భవిష్య నిధి సెటిల్మెంటు చివరి తేదీ వరకు వడ్డీ చెల్లించాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 24 తేదీ వరకే లెక్కిస్తున్నారు. అప్పటి నుంచి 31వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. ఇక లక్ష వరకు ఆటో సెటిల్మెంటుకు అవకాశం కల్పించారు. ఆలస్యంగా వాటా చెల్లించే యాజమాన్యాలపై పెనాల్టీలను రద్దు చేయాలని ఈపీఎఫ్ బోర్డు నిర్ణయించింది.
సీబీటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారంనాడు సమావేశమైన బోర్డు పలు నిర్ణయాలను ప్రకటించింది. యాజమాన్యాలు చెల్లించాల్సిన బకాయిలపై జరిమానాలను రద్దు చేశారు. సొంతంగా డిక్లరేషన్ ఇచ్చి, బకాయిలు చెల్లించవచ్చు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల యాజమాన్యాలకు, కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రయోజనం కలుగుతుంది.
సెటిల్మెంటు చివరి తేదీ వరకు వడ్డీ చెల్లించేందుకు 1952 కంపెనీల చట్టానికి సవరణ చేయనున్నారు. దీని ద్వారా ఉద్యోగి పీఎఫ్ సెటిల్మెంటు చేసే చివరి రోజు వరకు వడ్డీ పొందవచ్చు.