తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్నవానల కారణంగా జలాశయాలు నిండాయి.
పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి వానలు మొదలయ్యాయి. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది.దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మల్లెమడుగు జలాశయంలో రెండు గేట్లు ఎత్తి దిగువకు 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాళంగి జలాశయానికి 2,800 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 3,500 క్యూసెక్కులు వదిలారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నేడు రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో రాళ్ళను తొలగిస్తున్నారు. 15/8, 14/8 పాయింట్ల వద్ద బండరాళ్ళు రోడ్డుపై అడ్డుగా పడ్డాయి. ఇంజినీరింగ్ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు.
ఆదివారం ఉదయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు…
1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ.
FRL :- 697.14 మీ.
2) గోగర్భం డ్యామ్ :- 2894 అడుగులు
FRL :- 2894 అడుగులు
3) ఆకాశగంగ డ్యామ్ :- 855.00 మీ
FRL :- 865.00 మీ
4) కుమారధార డ్యామ్ :- 890.80 మీ
FRL :- 898.24మీ
5) పసుపుధార డ్యామ్ :- 896.35మీ
FRL :- 898.24మీ