ఉద్యోగార్థులకు సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ శుభవార్త చెప్పింది. ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్ సెంటర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో పలు పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతోంది.
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 22లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తెర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్ రీజియన్లలో కలిపి మొత్తం 723 ఖాళీలు ఉన్నాయి.
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణత, టైపింగ్ నాలెడ్జ్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ట్రేడ్స్‌మ్యాన్ మేట్/ సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకు 18- 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండటంతో పాటు ఇతర పోస్టులకు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ మెటీరియల్ అసిస్టెంట్‌కు రూ.29,200 నుంచి రూ.92,300, ట్రేడ్స్‌మెన్ మేట్‌కు రూ.18,000 నుంచి రూ.56,900 ఉంది. ఇక ఇతర పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు అందుతుంది.
ఫిజికల్ ఎండ్యూరెన్స్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ లో డిసెంబర్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులవారీగా ఖాళీలు…
1. ట్రేడ్స్‌మన్ మేట్ : 389
2. ఫైర్‌మ్యాన్ : 247
3. మెటీరియల్ అసిస్టెంట్: 19
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : 27
5. సివిల్ మోటార్ డ్రైవర్ : 4
6. టెలి ఆపరేటర్ గ్రేడ్-II: 14
7. కార్పెంటర్ అండ్ జాయినర్: 7
8. పెయింటర్ అండ్ డెకరేటర్: 5
9. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ : 11