ఖలిస్థాన్ ఉగ్రవాదికి కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఒంటారియో ప్రావిన్స్ మిల్టన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనతో సంబంధం ఉందనే ఆరోపణలపై అర్ష్ దల్లాను కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అర్ష్ దల్లా ఆలియాస్ అర్షదీప్ సింగ్‌ను భారత్‌కు అప్పగించాలని అధికారులు చేసిన ప్రయత్నాలను కెనడా పట్టించుకోలేదు. అర్ష దల్లా తరపు న్యాయవాదులు జామీను సమర్పించడంతో అతనికి కోర్టు బెయిల్ ఇచ్చింది. భారత్ తరపు న్యాయవాదుల వాదనలను పట్టించుకోలేదు.
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన అర్ష్ దల్లాపై హత్య, కిడ్నాప్, డ్రగ్స్ కేసులున్నాయి. గత ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం అర్ష్ దల్లాను ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి దల్లా పరారీలో ఉన్నాడు. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్‌కు దల్లా అత్యంత సన్నిహితుడు.