భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణలోని ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహేండ్స్ దళాలు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. అయితే ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. చనిపోయిన వారిలో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లెందు ఏరియా కార్యదర్శి భద్రు ఆలియాస్ పాపన్న కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
గత రాత్రి గ్రేహేండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ చేపట్టిన ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాలకు జరిగిన కాల్పుల్లో వారంతా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరణించిన వారిలో భద్రు ఆలియాప్ పాపన్న, మల్లయ్య ఆలియాస్ మధు, దేవల్ ఆలియాస్ కరుణాకర్, జమున, జైసింగ్, కిషోర్, కరుణ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్కౌంటర్పై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరణించిన వారి వివరాలు అధికారికంగా అందాల్సి ఉంది. ఇవాళ సాయంత్రానికి మృతదేహాలకు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించే అవకాశముంది. ఆ తరవాత పోలీసు అధికారులు మరణించిన వారి వివరాలు ప్రకటించనున్నారు.