భారత్‌లో అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అస్సాం పోలీసులు నిర్బంధించారు. వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ కూడా ఉన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఆ జట్టు భారత్‌లోకి చొరబడింది. వారినే అస్సాం పోలీసులు నిర్బంధించి, సరిహద్దుల దగ్గర నుంచి ఆమెను మళ్ళీ వెనక్కు బంగ్లాదేశ్‌లోకి పంపించేసారు.
పట్టుబడిన నక్సలైట్లలో దూదూ మియా చక్‌దెర్, అనువర్ హుసేన్, ఇమ్రాన్ హసన్, మొహమ్మద్ మహబూబ్ అనే నలుగురు పురుషులు, వారితో పాటు నహర్ బేగమ్ అనే మహిళ కూడా ఉంది.
రెండు రోజుల క్రితం నవంబర్ 28న అస్సాం పోలీసులు ఒక మహిళా నక్సలైటును పట్టుకున్నారు. ఆమె పేరు సతిర్ ఖాతూన్. ఆమెను భారత-బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర నిర్బంధించారు. వెంటనే వెనక్కి బంగ్లాదేశ్ పంపించేసారు.
అంతకుముందు నవంబర్ 19న అస్సాం పోలీసులు 9మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారు శ్రీభూమి జిల్లా ద్వారా భారత్‌లోకి చొరబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని కూడా అక్కడి నుంకే దేశం సరిహద్దులు దాటించేసారు.
బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడడానికి చేసే ప్రయత్నాలను ఫలించనివ్వబోమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివరించారు. తమ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, చొరబాటు యత్నాలను ఫలించనివ్వబోమని ఆయన చెప్పుకొచ్చారు.