బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై ఇటీవల పెరిగిపోతోన్న దాడులను ఆరెస్సెస్ ఖండించింది. యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీ హిందువులపై దాడులను నియంత్రించడంలో విఫలమైందని ఆ సంస్థ ధ్వజమెత్తింది. బంగ్లాదేశ్‌లో హిందువులు వారి హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నారని గుర్తుచేసింది.
హిందువులపై దాడులను ఖండిస్తూ ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ నిరసన తెలిపాడని, అయితే విషయాన్ని వక్రీకరించి జాతీయ జెండాను అవమానించాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ నిరసనలకు పిలుపునిచ్చింది.150 దేశాల్లోని ఇస్కాన్ ప్రతినిధులు, హిందువులు ఈ నిరసనల్లో పాల్గోనున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని భారత్ కోరింది.
బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో మూడు దేవాలయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులకు తెగబడ్డారు. దాడులను ఖండిస్తూ చిన్మోయ్ నిరసనల్లో పాల్గొన్నారు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చిన్మోయ్ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత ఇస్కాన్‌ను నిషేధించాలంటూ వేసిన కేసును బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టి వేసింది.