సవతి కూతురిపై వరుస లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై నమోదైన కేసులో కేరళలోని మలప్పురం మంజేరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. సవతికూతురుపై 2017 నుంచి వరుస అత్యాచారాలకు పాల్పడిన ఏఎం అష్రఫ్‌కు న్యాయమూర్తి 141 సంవత్సరాల శిక్ష విధించారు. తల్లి ఇంట్లో లేని సమయంలో సవతి కూతురుపై 2017 నుంచి అత్యాచారం చేస్తున్నట్లు రుజువు కావడంతో అతనికి శిక్ష ఖరారైంది.
అతనిపై పోస్కో, ఐపీసీ, జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పూర్తి చేశారు.వివిధ శిక్షలను ఏకకాలంలో అమలు చేస్తారు కాబట్టి, గరిష్ఠంగా అష్రఫ్‌కు 40 సంవత్సరాల జైలు శిక్ష అమలు కానుంది. రూ.7.85 లక్షల జరిమానా కూడా విధించారు.
తమిళనాడుకు చెందిన ఏఎం అష్రఫ్ కుటుంబం కేరళలో స్థిరపడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో సవతి కూతురుపై 2017 నుంచి వరుసగా అత్యాచారం చేసినట్లు రుజువైంది. దీంతో అష్రఫ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి, తుది తీర్పు వెలువరించారు.