విజయనగరం జిల్లా పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భోగాపురం మండలం పోలాపల్లి పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది.
శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు, భోగాపురం మండలం పోలాపల్లి వద్ద అదుపుతప్పింది. అనంతరం పల్టీకొట్టి పక్కరోడ్డులోకి దూసుకెళ్లింది. అటుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు ప్రమాదస్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మృతులు శ్రీకాకుళానికి చెందిన ద్రవిడ కౌశిక్, అభినవ్, మణిమాల, డ్రైవర్ జయేశ్ గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.