హిందువులపై దాడుల ఘటనలు పెరిగిపోవడంపై ఇస్కాన్ ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. బంగ్లాదేశ్‌లో దేవాలయాల ధ్వంసం, హిందువులపై తరచూ జరుగుతూన్న దాడులను ఖండిస్తూ.. నిరసన తెలిపిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ డిసెంబరు 1వ తేదీన ప్రపంచ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
ప్రపంచంలోని 150 దేశాల్లో ఇస్కాన్ దేవాలయాల వద్ద లక్షలాది భక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోల్‌కతాలోని ఆ సంస్థ ప్రతినిధి రాధారామన్ దాస్ పిలుపునిచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన తరవాత ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల హక్కులు కాపాడుతామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించిందనే విమర్శలు వస్తున్నాయి.
చిన్నోయ్ కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో జరిగిన దాడిలో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఇస్కాన్ సంస్థను నిషేధించాలంటూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
తాగాజా బంగ్లాదేశ్ ఛటోగ్రామ్ వద్ద మూడు హిందూ దేవాయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులకు దిగారు. దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇస్కాన్ ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.