అదానీ సంస్థపై అమెరికా లో వచ్చిన ఆరోపణలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అది ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులతోపాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారమని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ముందస్తుగా ఎలాంటి సమాచారం రాలేదని తెలిపింది.
ఇలాంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలు స్పష్టంగా ఉన్నయన్న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్, భారత్‌కు అమెరికా ఎలాంటి సమన్లు జారీ చేయలేదన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలే లక్ష్యంగా జరుగుతోన్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని మరోసారి గుర్తు చేసింది.
ఇస్కాన్‌ను నిషేధించాలని చేస్తున్న వాదనలపై స్పందించిన రణధీర్ జైస్వాల్, సామాజిక సేవలో ప్రపంచవ్యాప్తంగా సదరు సంస్థకు మంచి గుర్తింపు ఉందన్నారు.