సినీ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. వచ్చే నెలలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. గోవాలో వచ్చే నెలలో తన పెళ్ళి ముహూర్తం ఉందన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్, రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు.ఇటీవలే కీర్తి సురేశ్ తన రిలేషన్షిప్ విషయం బయటపెట్టారు.15 ఏళ్ళగా ఉన్న స్నేహబంధం ఇకపై జీవితాంతం వైవాహికబంధంగా కొనసాగుతుందన్నారు.
గోవాలో డిసెంబరు 11, 12 తేదీల్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూమార్తె కీర్తి. బాలనటిగా ఆమె పలు సినిమాల్లో నటించారు. నేను శైలజతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.