ప్రపంచమంతటినీ ఇస్లాంలోకి మార్చేయాలన్న ముస్లిముల అతివాద దృక్పథం జిహాద్లో ఓ కొత్త కోణమే గ్రూమింగ్ జిహాద్. మైనర్ బాలికలను ఆకట్టుకుని పెళ్ళి పేరుతో ఎత్తుకుపోయి మతం మార్చడమే ఈ గ్రూమింగ్ జిహాద్. తాజాగా అలాంటి గ్రూమింగ్ జిహాద్ కేసు ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
హసన్ అనే ముస్లిం ఉత్తరప్రదేశ్ హర్దోయి జిల్లా షహాబాద్ తహసీల్‌లోని దరియాపూర్ విక్కూ గ్రామానికి చెందిన యువకుడు. ఢిల్లీలో చదువుకుంటున్న 16ఏళ్ళ అమ్మాయిని ప్రేమ కబుర్లు చెప్పి బుట్టలో పడేసాడు. ఆ బాలికను ఢిల్లీలోనే తనతో ఒక మూడు నెలలు ఉంచుకున్నాడు. తర్వాత తన స్వగ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మసీదులో ఆమెను ఇస్లాంలోకి మతం మార్చి, ఆ తర్వాత ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ సంఘటన గురించి ‘కేసరియా హిందూ వాహిని’ సంస్థ హర్దోయి జిల్లా అధ్యక్షుడు పవన్ రస్తోగీకి తెలియడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దరియాపూర్ గ్రామానికి నవంబర్ 27న వెళ్ళారు. అక్కడ బాధితురాలిని కాపాడి, తమ సంరక్షణలో ఉంచారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.
‘‘హసన్ ఒక హఫీజ్‌గా (మతగురువు) పనిచేస్తున్నాడు. అతను ఢిల్లీలో తన దగ్గర చదువుకున్న అమ్మాయిని షహాబాద్ తీసుకొచ్చాడు. ఆమెను ఇస్లాంలోకి మతం మార్చాడు తర్వాత దరియాపూర్ గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడ ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఆ విషయం నాకు తెలియగానే జిల్లా ఎస్పికి తెలియజేసాను. షహాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జితో మాట్లాడాను. అవసరమైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా కలుస్తాం. ఇటువంటి శిక్షార్హమైన నేరాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందే’’ అని పవన్ రస్తోగీ చెప్పారు.
ఈ సంఘటనను హర్దోయ్ సిటీ సర్కిల్ ఆఫీసర్ అంకిత్ మిశ్రా ధ్రువీకరించారు. భారతీయ న్యాయ సంహిత, యూపీ చట్టవిరుద్ధ మతమార్పిడుల నిషేధ చట్టం సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసామని చెప్పారు. పోలీసులు ఎట్టకేలకు ప్రధాన నిందితుడు హసన్‌ను అరెస్ట్ చేసారు.