విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంతో పాటు యూపీలోని సంభల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ విషయాలపై చర్చించాలని విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గత మూడు రోజులుగా ఇదే తరహా గందరగోళం పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన 17 నోటీసులను చైర్మన్ జగదీప్ తిరస్కరించారు. చైర్మన్ ఎంత విన్నవించినా విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ సమావేశం కానుంది. లోక్ సభ లో కూడా వాయిదాలపర్వం కొనసాగుతోంది.