మణిపూర్ లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో కొంతకాలంగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎదుర్కొంటున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇంఫాల్, జిరిజామ్ జిల్లాల్లో గడిచిన 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకున్నాయి. నేటి నుంచి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
శాంతి భద్రతలను పరిరక్షణలో భాగంగా మణిపూర్ లో కేంద్ర ప్రభుత్వం భారీగా సైన్యాన్ని మోహరించింది. 288కంపెనీల బలగాలు విధుల్లో ఉన్నాయి.