ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4న జరగనుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో మంత్రివర్గ భేటీ జరగనుంది.
ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2న సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు సూచించారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు పాట్లు, సూపర్ సిక్స్ పథకాల అమలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి మాస్టర్ ప్లాన్‌తో పాటు పలు కీలక అంశాలపై మంత్రులు సమాలోచనలు చేయనున్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.