బంగ్లాదేశ్‌లో హిందువుల మీద ఘాతుకాలకు అంతే లేకుండా పోతోంది. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ మతఛాందస ప్రభుత్వం, ఇప్పుడు ఆయన అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేసింది.
జైల్లో బందీగా ఉన్న చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు ఆహారం తీసుకువెళ్ళిన ఆయన అనుచరులు ఇద్దరిని బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసారు. ఏ ఆరోపణలపై వారిని అరెస్ట్ చేసారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
బంగ్లాదేశ్‌లో హిందువులను ఏకపక్షంగా లక్ష్యం చేసుకుని వారిపై దాడులు చేస్తుండడాన్ని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు బంగ్లాదేశ్‌లో సనాతన్ జాగరణ్ మంచ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చిట్టగాంగ్‌లోని పుండరీక ధామ్ అధ్యక్షుడు. ఆయనను నవంబర్ 25న రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల కృష్ణ రక్షణ కోసం ప్రయత్నిస్తుండడమే ఆయన చేసిన నేరం.