సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఎన్నికలు హామీలు అమలు చేయకపోగా స్కాంల పాలన నడుస్తోందన్నారు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన పాదయాత్ర సమయంలో ప్రజలు కష్టాలను ప్రత్యక్షంగా చూశానన్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రతీ ఇంటికి మంచి చేశామన్నారు. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి పాలనలో కారణంగా రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో ఉందని విమర్శించారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టదారు. బడ్జెట్‌తో భరోసా ఇవ్వలేకపోయారని విమర్శించారు. లిక్కర్, ఇసుక స్కాంలతో పాటు ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు కనిపిస్తున్నాయని ఆరోపించారు.